![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ గా ఉండి ఇరవై మందిని హ్యాండిల్ చేసిన ఆదిత్య ఎలిమినేట్ అవడం అనేది హౌస్ మేట్స్ కి ఒక లోటు అనే చెప్పాలి. అయితే నామినేషన్లో ఉన్న తొమ్మిది మంది నుండి ఆదిత్యని ఎలిమినేట్ చేసాడు నాగార్జున. ఆదిత్య ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో అందరు ఎమోషనల్ అయ్యారు. హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా తమ అభిప్రాయలను పంచుకున్నారు. "పాప జాగ్రత్త, చిట్టి తల్లిని అడిగానని చెప్పు" అని శ్రీసత్య అంది. "సిరితో మాట్లాడండి" అని శ్రీహాన్ అన్నాడు. ఇలా అందరూ ఒక్కొక్కరుగా చెప్పుకొచ్చారు. బయటకు వెళ్ళేప్పుడు హౌస్ మేట్స్ అందరికి, "బాగా ఆడండి. టాస్క్ లో గెలిచే వరకు డోంట్ గివ్ అప్. వండర్ ఫుల్ జర్నీ గాయ్స్. మిస్ యూ గాయ్స్. లవ్ యూ గాయ్స్" అని ఆదిత్య, హౌస్ మేట్స్ కి బై చెప్పి వచ్చేసాడు.
ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన ఆదిత్య, నాగార్జునతో కాసేపు మాట్లాడాడు. కాగా నాగార్జున తన ఏవీ చూపించాడు. అది చూసి కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆదిత్య మాట్లాడుతూ, "బిగ్ బాస్ టాట్ మి ఏ లాట్" అని నాగార్జునతో చెప్పాడు. అయితే వెళ్ళేముందు హౌస్ మేట్స్ అందరి వీక్ నెస్ చెప్పమని అన్నాడు.
ఆ తర్వాత ఆదిత్య ఒక్కొక్కరి గురించి ఇలా చెప్పుకొచ్చాడు. "ఫైమా స్టాటజీ లు వాడొచ్చు. మనం గెలవాల్సింది ఆటనే కాదు. ప్రేక్షకుల మనసు గెలవాలి. ఇక రాజ్ నువ్వు సూపర్..గ్రోత్ లో రాజ్ హై. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటితో కాన్ఫిడెంట్ గా ఆలోచించి మాట్లాడాలి. రోహిత్ స్టే బ్యాలెన్స్. మెరీనా ప్లే ఇండిపెండెంట్. సత్య నువ్వు నా చెల్లి అనుకున్నా. ఐ మిస్ యూ ఏ లాట్. నువ్వు కోపంగా ఉన్నప్పుడు నోరు కొంచెం అదుపులో ఉంచుకోవాలి. ఇక శ్రీహాన్..నువ్వు స్మాట్ కాబట్టి బ్యాలెన్స్ గా ఉండి ఆలోచించు. కీర్తిభట్ ఎక్కువగా ఆలోచించకు, యూ ఆర్ ఏ బెస్ట్ ప్లేయర్. యూ ఆర్ ఏ డైమండ్. చాలా ఉంది నీలో, కమ్ ఆవుట్" దట్స్ ఆల్ యువర్ హానర్ అని ఆదిత్య చెప్పి ముగించాడు. ఆ తర్వాత నాగార్జున ఈ రోజు దట్స్ ఆల్ యువర్ హానర్ అని ముగించాడు.
![]() |
![]() |